జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహిళా మండలి అధ్యక్షులు పద్మ. ఈ నేపథ్యంలో భాగంగా కుమారస్వామి మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండాలి. స్త్రీ లేనిది జన్మం లేదు స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు అని కొనియాడారు స్త్రీల పాత్ర సమాజంలో సంఘంలో చాలా గొప్పది అని కొనియాడారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అక్షర సత్యం అనడానికి నిలువెత్తు నిదర్శనంగా తన పుట్టిన రోజు సందర్భంగా హాజరైన మహిళ అధ్యక్షురాలు పద్మ ను ఘనంగా శాలువాతో మరియు కిరీటం పెట్టి ,కత్తి బహుకరించి, సన్మానం చేశారు.ఈ సందర్భంగా పద్మ గురించి మాట్లాడుతూ పట్టుదలతో ప్రయత్నిస్తే కానిది లేదు అనె దానికి నిలువెత్తు నిదర్శనం పద్మ అని తెలియజేశారు.ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో సామాజిక అభివృద్ధి సమాజ ప్రగతి సాధన లక్ష్యంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. భారతదేశంలో బుసలు కొడుతున్న కరోనా మొదటి మరియు రెండవ వేవు లో కూడా ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారి లో పద్మ కూడా మొదటి వరుసలో ఉంటుంది అని తెలియజేశారు. అత్యద్భుతమైన సేవలు అందించడం ఆమె గొప్పతనం. మహిళా సాధికారత, మహిళల చైతన్యం కోసం, అనునిత్యం అనుక్షణం ప్రయత్నం చేస్తున్న మహిళా శక్తి కి నిలువెత్తు నిదర్శనం పద్మ అని తెలియజేశారు. ఎక్కడైనా ,మహిళలపై అత్యాచారాలు అవమానాలు ఎదుర్కొన్న అక్కడ పద్మ గళం ఉంటుంది అనేది అంతే అక్షర సత్యం అని తెలియజేశారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more