అవును. తె.దే.పా కాంగ్రెస్ మళ్ళీ పొత్తు ఏంటని అనుకుంటున్నారా? ఇది తెలుగు రాష్ట్రాల్లో విషయం కాదు. అండమాన్, నికోబార్ ఎలక్షన్లలో. అక్కడ జరుగబోయే మున్సిపల్, పంచాయితీ ఎన్నికల గురించి కాంగ్రెస్, టి.డి.పి జత కడుతున్నాయి. మార్చ్ అరో తేదీన పోలింగ్, ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ బుధవారం ఫోర్టుబ్లెయిర్ లో తెదేపా స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావ్, ఏ.ఎన్.టి.సి.సి. ప్రెసిడెంట్ రంగలాల్ హల్దార్ సమావేశమై ఈ విషయాన్ని నిర్ధారించారు. అండమాన్, నికోబార్ ప్రాంత అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలనలను ద్రుష్టిలో ఉంచుకుని ఈ పొత్తు పెట్టుకున్నామని వారు తెలియజేశారు.