తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్ లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాటలు మరియు నృత్యాలు ఎంతో అలరించాయి . దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ వోటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేస్తున్నారు. సంబురాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు ప్రధాన ఆకర్షణ గ నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యుల చేప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. పండుగల ను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యత ని తెలియజేస్తున్నందు కు ఎంతో సంతోషం గ ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత మరియు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలను ఆన్లైన్ లో వేలాది మంది వీక్షించారు.
సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహయo అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు మరియు ప్రతి ఒక్కరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.