భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపుమేరకు, ఈరోజు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు గోస బిజెపి పోరు దీక్షను రంగారెడ్డి జిల్లా ఎక్స్ వైస్ చైర్మన్ “నంద కుమార్ యాదవ్” తన గృహంలో దీక్ష చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తెరాస ప్రభుత్వం వ్యవహ రిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల కోసం 140 శాతం సబ్సిడీతో రైతులకు యురియా అందిస్తుందని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతు ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు..
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్:జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మంచి కోసం ఉపయోగిస్తే...
Read more