ఆందోల్ : ఆల్లాదుర్గ్ మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి మరియు శాదిముబారక్, కొత్త రేషన్ కార్డులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా, ఆడపిల్ల పెళ్ళి చేస్తే కల్యాణలక్ష్మి, శాది ముబారక్, రైతు చనిపోతే అయిదు లక్షల ఇన్సూరెన్స్ వివిధ పథకాలు ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిది అన్నారు.
ఈ కార్యక్రమంలో AMCచైర్మన్ రజినీకాంత్,PACS చైర్మన్ దుర్గారెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, కో ఆప్షన్ సయ్యద్, వైస్ ఎంపీపీ స్వరూప నర్సింహులు, జాగృతి కన్వీనర్ కృష్ణ గౌడ్, అల్లా దుర్గ్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రజినీకాంత్,మరియు సర్పంచ్ లు, ఎంపీటీసీ లు , తెరాస నాయకులు కార్యకర్తలు, మరియు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.