అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నినాదం తెరపైకి వచ్చింది. దీంతో రేవంత్ సర్కార్ బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వం చేయలేని పని.. ప్రస్తుత ప్రభుత్వం చేస్తానని తెలుపడంతో బీసీలు అంతా హర్షం వ్యక్తం చేశారు. అయితే కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీసీల సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి జరుగుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని తెలిపారు. కాగా నేడు పార్లమెంటులో బీసీల మద్దతు కాంగ్రెస్ కి అనే బీసీ బుక్లెట్ ను, తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (BC wellfare Minister ponnam prabhakar) అందజేశారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసిన కుమార స్వామి.. మంత్రితో కాసేపు ముచ్చటించారు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజులలోపే బీసీల అభివృద్ధికి కులగణన జీవో(26) తీసుకువచ్చిందని.. అలాగే 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కొనియాడారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు..