తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన కే కేశవరావు.
తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు (K. Keshava Rao)నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి,(National BC Dal president Dundra kumara Swamy)కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి సుధాకర్ గౌడ్, మరియు బీసీ ప్రతి నిధుల బంధం అభినందనలు తెలిపారు .ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న కేశవరావు ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా నియమించడం హర్షించదగ్గ విషయంగా పేర్కొన్నారు.