నేరేడు గింజల్ని దోరగా వేయించి దంచి పొడి చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి కషాయం కాచి, అందులో పాలు, తాటి కలకండ కలిపి కాఫీలాగా రెండు పూటలా తాగితే అతి మూత్రం, మధు మేహం అదుపులోకి వస్తాయి.
సీజనల్‌లో అల్లనే రేడు పండ్లను రోజుకు కనీసం 10 తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శుభకార్యాల్లో అల్లనేరేడు ఆకులను కడితే సూక్ష్మక్రిములు దరిచేరవు. కాలేయానికి మేలే చేస్తుంది. ఎండకాలంలో దప్పిక అరికడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్లు నివారిస్తాయి. కడుపులోకి ప్రమాదవశాత్తు చేరిన తల వెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగిస్తాయి.
చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు బెరడు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది. పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తుంది. చెట్టు ఆకులు ఎండబెట్టి చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పళ్లు తోముకుంటే గట్టి పడతాయి.
కడుపులో నులి పురుగులను నివారిస్తుంది. మూత్రాశయ, నోటి, క్యాన్సర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది. చెట్టు ఆకులను గాయంపై కట్టవచ్చు. విటమిన్ ఏ, సీ అధికంగా లభిస్తుంది. శరీరంపై కాలిన గాయాలుంటే తర్వాత మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది. #నేరేడు ఆరోగ్య ప్రయోజనాలు