బీసీల రిజర్వేషన్లు పెంచండి.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumara Swamy)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి చర్యలు తీసుకుంటూ ఉండడం శుభపరిణామమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సమయం దగ్గర పడుతూ ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచితే ఎంతో మంది బీసీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని.. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి మేలు చేయాలని దుండ్ర కుమారస్వామి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి పొన్నం ప్రభాకర్ ను, ప్రభుత్వ సలహాదారులు వేణు గోపాల్ రావును కలిసి ఇప్పటికే బీసీల సమస్యల గురించి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి విన్నవించుకున్నారు. వీరంతా సానుకూలంగా స్పందించడం విశేషం.
ఇక బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామని.. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ప్రభుత్వం జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించింది.. కులగణన చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్లను పెంచాల్సి ఉంటుందని.. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే చాలా మందికి మొండి చేయి చూపినట్లే అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. బీసీ సంఘాలు రిజర్వేషన్లను పెంచాలని చాలా ఏళ్ల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ విషయంపై ఎంతో మంది కాంగ్రెస్ నేతలు కూడా బీసీలకు మద్దతు తెలిపారు. కలిసి పోరాటం చేశారు. 2024 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచి ఎన్నికలు జరుపుతామని బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు దుండ్ర కుమారస్వామి.
National BC Dal President Dundra Kumaraswamy Met Minister Ponnam Prabhakar and government advisers Venu Gopal Rao have already discussed the issues of BCs.
కొందరు పనిగట్టుకుని రిజర్వేషన్ల శాతం గురించి కొన్ని తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిదీ.. అది ప్రజలలోకి వెళితే కాంగ్రెస్ ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.. దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు దుండ్ర కుమారస్వామి. పలు రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే తెలంగాణలో కూడా అది వీలైనంత త్వరగా సాధ్యమవుతుంది. పలు రాష్ట్రాల్లో సీలింగ్‌ను అధిగమిస్తూ రిజర్వేషన్లు కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్నాయి.
2024లో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ లో బీసీల రిజర్వేషన్లను కులగణన చేసి 42 శాతానికి పెంచుతామని చెప్పింది.. దీంతో బీసీలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. త్వరలోనే ఆ పని చేస్తే కాంగ్రెస్ పాలనను ప్రజలు చిరకాలం మనసులో పెట్టుకుంటారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర కుల గణనకు అడుగులు వేస్తోంది. అది మరింత వేగంగా ముందుకు సాగాలి. బీసీలను రాజకీయంగా అడ్డుకునేందుకు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత త్వరగా అడ్డుకోవాలి. కులగణన చేస్తామని ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చెప్పినందుకే కాంగ్రెస్‌కు బీసీలు భారీగా ఎంపీ సీట్లను ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఓ మంచి వార్తను వీలైనంత త్వరగా బీసీలు ఉంటారని ఆశిస్తూ ఉన్నాం.