అనధికార లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద ఫీజు నోటీసు పొందిన 13,576 మంది దరఖాస్తు దారులకు హెచ్ఎండీఏ అవకాశం కల్పించింది. జనవరి 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ కింద ఫీజు నోటీసు పొంది పూర్తి పేమెంట్ కట్టని వారికి సదవకాశం కల్పించింది. హెచ్ఎండీఏ నుంచి అప్రూవల్, ఫీజు నోటీసు పొంది ఇప్పటి వరకు చెల్లింపులు జరపని వారు డేట్ ఆఫ్ ఇంటిమేషన్ నుంచి 10 శాతం సాధారణ వడ్డీతో చెల్లింపులకు హెచ్ఎండీఏ అవకాశం ఇచ్చింది. పది శాతం సాధారణ వడ్డీతో మిగతా డబ్బులు చెల్లించాలని హెచ్ఎండీఏ సూచించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ(హెచ్ఎండీఏ)కి దరఖాస్తు చేసుకుని ఫీజు నోటీసు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించింది.
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి
బీసీలకు పార్టీ పరంగా కాదు… చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలి.. 42% రిజర్వేషన్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం పునర్‌ఆలోచన చేయాలి: దుండ్ర కుమారస్వామి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు...
Read more