అనధికార లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద ఫీజు నోటీసు పొందిన 13,576 మంది దరఖాస్తు దారులకు హెచ్ఎండీఏ అవకాశం కల్పించింది. జనవరి 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ కింద ఫీజు నోటీసు పొంది పూర్తి పేమెంట్ కట్టని వారికి సదవకాశం కల్పించింది. హెచ్ఎండీఏ నుంచి అప్రూవల్, ఫీజు నోటీసు పొంది ఇప్పటి వరకు చెల్లింపులు జరపని వారు డేట్ ఆఫ్ ఇంటిమేషన్ నుంచి 10 శాతం సాధారణ వడ్డీతో చెల్లింపులకు హెచ్ఎండీఏ అవకాశం ఇచ్చింది. పది శాతం సాధారణ వడ్డీతో మిగతా డబ్బులు చెల్లించాలని హెచ్ఎండీఏ సూచించింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ(హెచ్ఎండీఏ)కి దరఖాస్తు చేసుకుని ఫీజు నోటీసు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించింది.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more