శేరిలింగంపల్లి :క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగప డతాయని భెల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ క్యాoపస్ లో సహోదయా భెల్ క్లస్టర్స్ అండర్ 14 వాలీబాల్ పోటీలు జరిగగాయి. ఈ పోటీలను స్కూల్ కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్ తో కల్సి ప్రిన్సిపాల్ ప్రారంభించారు. ఈ పోటీల్లో క్లస్టర్స్ పరిధిలోని మొత్తం 15 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రీడల వల్ల చురుకుదనం పెరిగి, చదువుల్లో కూడా ఏకాగ్రత పెరుగుతుందని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు కూడా ప్రోత్సహించాలని కోరారు.చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మంచి ఫలితాలు సాధించామని తెలిపారు.నిపుణులైన ఫిజికల్ టీచర్ల శిక్షణలో ఈ స్కూల్ నుండి వెళ్లిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీలో రాణిస్తూ స్కూల్ కు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీచ్ వాలీబాల్ క్రీడాకారుడు రామకృష్ణ, జ్యోతి విద్యాలయ పి ఈ టి లు బాలవీరయ్య, వేణుగోపాల్, శ్రీనివాస్ తో పాటు, అన్ని స్కూల్ ల పి ఈ టి లు పాల్గొన్నారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more