జూలై 26, 2019: సైబరాబాద్ కమిషనరేట్, మాదాపూర్ జోన్ స్మైల్ టీం (ఆపరేషన్ ముస్ఖాన్) సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ఎం.డి. ఉమర్ గారి అధ్వర్యంలో ఈరోజు మాదాపూర్ లోని వివిధ వర్తక వ్యాపార సంస్థల్లో సోదాలు చేసి, మైనర్ బాలలను పనికి వినియోగిస్తున్న ఒక హోటల్ (అభిరుచి టిఫిన్స్) మరియు రెండు బైక్ మెకానిక్ షాపుల (రెడ్డి మోటార్స్ మరియు శ్రీ గగన్ సాయి మోటార్స్) యజమానులపై మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేసారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈసందర్భంగా ఎస్.ఐ. ఎం.డి.ఉమర్ గారు వివిధ షాపుల/సంస్థల యాజమాన్యానికి బాలలను పనికి వినియోగించడం చట్టపరంగా నేరమని అందుకు వారు పోస్కో చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, బాలల హక్కుల చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలలు ఈవయస్సులో ఉండాల్సింది బడిలో కాని పనిలో కాదని షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతే కాకుండా ఎవరైనా బాలలను నిర్భంధంగా పనుల్లో వినియోగిస్తున్నట్టు తెలిస్తే బాధ్యత కలిగిన పౌరులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం
GO నం. 9 పై హైకోర్టు నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణం— డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు నిలబెట్టడానికి...
Read more