• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..?

AdminbyAdmin
15/11/2022
inNews
0
కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..?

తండ్రి బాటలో తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు

ప్రజా నాయకుడు

కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..?

తండ్రి బాటలో తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు

కూకట్ పల్లి ప్రాంతంలో ఎంతో పట్టు ఉన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రజల్లో మంచి పేరు, గుర్తింపును తెచ్చుకుంటూ ఉన్న ఆయనను బీజేపీ తన చెంతన చేర్చుకుంది. భారతీయ జనతా పార్టీ తమకు ఎంతో మంది పవర్ ఫుల్ లీడర్లు కావాలని తెలంగాణ రాజకీయ నాయకుల విషయంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టగా.. వడ్డేపల్లి రాజేశ్వర రావు ఇప్పుడు వారి పక్షాన నిలిచారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోగలిగే ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతూ ఉండగా.. నాయకత్వం కోసం వడ్డేపల్లి రాజేశ్వర రావును తమ కేడర్ లోకి తీసుకుంది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఈయనకంటూ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుధీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వడ్డేపల్లి కుటుంబానికి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో మంచి పట్టు ఉంది.

భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులతో చర్చించి వడ్డేపల్లి రాజేశ్వర్​రావు ఆ పార్టీలోకి చేరారు. వడ్డేపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేరడంతో కూకట్​పల్లి నియోజక వర్గం పరిధిలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్​రెడ్డి, మరియు కూకట్పల్లి ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర్​రావును బీజేపీలోకి ఆహ్వానించారు. ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తిగా వడ్డేపల్లి రాజేశ్వర్​రావుకు స్థానికంగా మంచి పేరు ఉంది. ఎంతో మంది పేద విద్యార్థులకు తన వంతు సహాయం చేశారని.. పేదలకు ఆర్థికంగా సహాయం చేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలోనూ ఆయన ముందు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ చేతిలో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ.. గ్రేటర్​ఎన్నికలలో మూసాపేట్​ డివిజన్‌లో విజయాన్ని అందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలో ఉన్న హరీష్​రెడ్డి గ్రేటర్​ ఎన్నికల ముందు బీజేపీలో చేరడం స్థానికంగా బలాన్ని ఇచ్చింది. మేడ్చల్​జిల్లా అర్బన్​ అధ్యక్షుడిగా ఎన్నికైన హరీష్​రెడ్డి, మరియు కూకట్పల్లి ఇన్చార్జ్ మాధవరం కాంతారావు పలువురిని కలుపుకుని వెళుతూ ఉన్నారు. నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేస్తూ, బూత్​స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. కూకట్​పల్లిలో మంచి పట్టున్న వడ్డేపల్లి రాజేశ్వర్​రావు బీజేపీలో చేర్చుకుని కూకట్ పల్లి నియోజకవర్గంలో బీజేపీ మరింత పవర్ ఫుల్ గా మారింది.

ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ ​వడ్డేపల్లి నర్సింగరావు కుమారుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు. తండ్రి పేరుకు.. వడ్డేపల్లి కుటుంబానికి మరింత కీర్తిని తెచ్చిపెట్టారు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు. పలు కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్లి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వడ్డేపల్లి రాజేశ్వర్​రావు పిలుపు ఇస్తే చాలు ఎంతో మంది స్థానిక యువత ఆయన కోసం ముందుకు వస్తారు. వచ్చే తెలంగాణ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎంతో ముఖ్యం. రెండు పర్యాయాలు టీఆర్ఎస్ తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోగా.. మూడోసారి మాత్రం అలా జరగకూడదని బీజేపీ పావులు కదుపుతూ ఉంది. దీంతో వడ్డేపల్లి రాజేశ్వర్​రావును కూకట్ పల్లి బీజేపీ అభ్యర్థిగా నిలిపే అవకాశం లేకపోలేదు.

కూకట్ పల్లి నియోజకవర్గం అంటే ముఖ్యంగా సెటిలర్స్. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న మాధవరం కృష్ణారావు 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి మాధవరం కృష్ణారావు వెళ్లిపోయారు. 2018లో చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని బరిలో నిలపగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న మాధవరం కృష్ణారావునే విజయం వరించింది. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇక్కడ సెటిలర్లను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తూ ఉంది. 2018 లో హోరాహోరీ టీడీపీ-టీఆర్ఎస్ మధ్య మాత్రమే సాగింది. అయినప్పటికీ బీజేపీకి 11,943 ఓట్లు పడ్డాయి. ఇక అక్కడ టీడీపీ అంటూ లేకుండా పోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ తప్పదు. చాలా వరకూ టీడీపీ ఓటర్లను బీజేపీ ఆకర్షించే అవకాశం లేకపోలేదు. కూకట్ పల్లిలో ముస్లింల ఓట్ షేర్ కూడా చాలా ఉంది. 60వేలకు పై చిలుకు ముస్లిం ఓటర్లు కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉన్నారు. వీరిని భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీమాంధ్రప్రాతం ప్రజలు ఇక్కడ ఎక్కువగా స్థిరపడ్డారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఐటీ విప్లవం వచ్చాక ఈ ప్రాంతమే ఎక్కువగా అభివృద్ధి చెందింది.. దీంతో కూకట్ పల్లిలో సెటిలర్స్ ఓట్లు కూడా చాలా కీలకమే..!

2011 జనాభా లెక్కల ప్రకారం.. కూకట్‌పల్లి అసెంబ్లీలో ఎస్సీ ఓటర్లు దాదాపు 18,032, దాదాపు 4.59%. ST ఓటర్లు దాదాపు 5,814, దాదాపు 1.48%. కూకట్‌పల్లి అసెంబ్లీలో ముస్లిం ఓటర్లు దాదాపు 64,034 మంది ఉన్నారు. ఈ శాతం 16.3% వరకూ ఉంది. కూకట్‌పల్లి అసెంబ్లీలో పట్టణ ఓటర్లు దాదాపు 392,846, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 100%. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి కూకట్‌పల్లి అసెంబ్లీ మొత్తం ఓటర్లు 392846 ఉన్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి కూకట్‌పల్లి అసెంబ్లీ పోలింగ్ బూత్‌ల సంఖ్య 387. 2019 పార్లమెంట్ ఎన్నికలలో కూకట్‌పల్లి అసెంబ్లీకి జరిగిన ఓటింగ్ శాతం – 50.77% . 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూకట్‌పల్లి అసెంబ్లీకి జరిగిన ఓటింగ్ శాతం – 57.81% ఉంది. ఓటింగ్ శాతం పెరిగి బీజేపీకి ప్లస్ పాయింట్లుగా పలు కమ్యూనిటీలను ఆకర్షించుకుంటే మాత్రం కూకట్ పల్లిలో బీజేపీ కి లాభ దాయకం కావచ్చు. సెటిలర్ల మనసు గెలిచేలా వడ్డేపల్లి రాజేశ్వర్​రావు మరిన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంది.

Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News