చేతి గోరుపై తెల్లటి అర్ద చంద్రాకారం గుర్తు ఉందా..అయితే మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోండి
చేతి వేలి గోర్లపై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధచంద్రాకారంలో నెలవంకను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించే ఉంటారు లెండి. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండదు. కాగా ఆ ఆకారాన్ని ‘లునులా (lunula)’ అని పిలుస్తారు. ఈ లునులా మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటిగా చెప్పబడుతోంది. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్థం