యాదవులు ఉన్నత స్థాయికి ఎదగాలి.
యాదవులు రాజకీయాలలో రాణించాలి.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
శ్రీకృష్ణుని అంశంతో జన్మించిన యాదవులు కులవృత్తిలో భాగంగా పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని యాదవుల కార్తీక మాస వనభోజనంలో పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
ఆదివారం రోజు అఖిల భారత యాదవ సంఘం కే పీ హెచ్ బి కమిటీ సభ్యులు నాగరాజు యాదవ్, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, రమణయ్య, శంకర్ రమణ యాదవ్, గిరి యాదవ్ ఆధ్వర్యంలో గోవర్ధనగిరి కృష్ణ దేవాలయంలో ఘనంగా కార్తీక మాస వన భోజన 18వ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి రాజయ్య, జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, రాష్ట్ర బిజెపి నాయకుడు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బేరి రామచంద్ర యాదవ్, ఏసీపీ జానకిరామ్, బి ఎస్ పి రాష్ట్ర నాయకుడు ఓ శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, జాతీయ బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, కుల సంఘ నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘ నేతలు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు జీవితాంతం ప్రేమ, స్నేహం, కర్తవ్యం, భక్తి, ధర్మం సంబంధించిన పాఠాలను బోధించేవాడు, వాటిని యాదవులు ప్రేరణగా తీసుకోవాలని చెప్పారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని అర్థం చేసుకోవడం, పశువుల పెంపకం యాదవులతోనే సాధ్యమని చెప్పారు. యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలి అని చెప్పారు.
భారతదేశంలోని మొత్తం జనాభాలో 20% యాదవులు ఉన్నారని, ఈ భూమిపై 3% జనాభా కలిగిన అనేక అనుబంధ కులాలు ఉన్న వర్గం యాదవులని గుర్తుంచుకోవాలని సూచించారు. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, కూడా ఈ కులానికి జాడలు ఉన్నాయని తెలియజేశారు.
నేటి రాజకీయాల్లో సైతం యాదవులు ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా యాదవులు పని చేశారు. అనేక రాజకీయ పార్టీల ద్వారా యాదవులు దేశంలో రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్నారు. కార్తీక మాసంలో వనభోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందాన్ని మరియు సద్గుణాలను ప్రదర్శించే విధంగా కార్తీక వనభోజనాలు జరుపుకోవాలి అని అని అన్నారు. మన సాంప్రదాయాన్ని, సాంస్కృతిని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని తెలిపారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఐకమత్యంతో, యాదవ కుల బంధువులు, యాదవ ప్రముఖులు, పెద్దలు, నాయకులు, మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు అందరూ యాదవుల కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొని యాదవుల ఐకమత్యాన్ని చాటారు.ఎంతో కష్టపడి ఎదిగిన యాదవులు సమాజానికి మరింత తోడ్పాటును అందించి, అనేక మంది పేదలను, అభాగ్యులను ఆదుకుంటారని ఆశించారు.