బిజెపి పార్టీ జాతీయ మైనారిటీ నాయకులు రహమతుల్లా ప్రత్యేకంగా యాదగిరిగుట్ట నుండి అర్చకులను పిలిపించి బండి సంజయ్ కి ఆశీర్వాదం ఇప్పించారు. లాక్ డౌన్ సమయం లో నిరుపేదల కు అండదండగా నిలవడం జరిగింది,
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇది అభాగ్యుల దుస్థితి, వేల మైళ్ళ దూరం నుండి పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలు ఆకలితో అలమటిస్తుంటే కదిలిన హృదయం స్పందించింది, ఆదుకుంది ఆసరాగా నిలబడింది, ఆ హృదయమే, మన రహమతుల్లా, ఇది నిన్నో మొన్నో చేపట్టిన పరోపకార కార్యక్రమం కాదు, 100 రోజుల తరబడి చేస్తూనే ఉన్నారు, ఏళ్ల తరబడి చేస్తూనే ఉంటారు. పువ్వు పుట్టినప్పుడే పరిమళించిన చందంగా వారి దానశీలత వారి దేహంలోనే ఇమిడిపోయి ఉంది, వారి రక్తంలో కరిగిపోయి ఉంది. వారిని కని పెంచిన పుణ్యమూర్తుల నుండి అబ్బిన సంస్కారం అది, వారి గురువుల నుండి నేర్చుకున్న అభ్యుదయం వారిది.వారి నడక, నడత అందరికీ ఆదర్శనీయం, అందరూ అనుసరణీయం ఆయన శైలి. మొన్న జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ నాయకులను ప్రోత్సహించి వారిని విజయపథంలో కి దూసుకుపోయే విధంగా వారు కృషి చేయడం జరిగింది . బిజెపి పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకొని యాదగిరిగుట్ట అర్చకుల చేత పూజలు జరిపించి బండి సంజయ్ తదితరులను ఆశీర్వదింప చేశారు. దైవత్వం పట్ల వారికున్న ఇష్టం తెలియకనే తెలియజేస్తుంది. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్లందరూ విశ్వాసానికి కట్టుబడి ప్రజలకు మేలు చేకూర్చాలని సందేశం ఇచ్చారు. అవినీతి రహిత పాలన ఈ కమలదళం వల్లనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. నాలుగు స్థానాల నుండి 48 స్థానాల వరకు విజయ పతాకం ఎగరేసిన టువంటి బిజెపి పార్టీకి భవిష్యత్తులో ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన టువంటి కార్పొరేటర్ లందరూ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు అయినందువల్ల మేధావి వర్గం బీజేపీ సొంతం అయినట్లుగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బిజెపి తిరుగులేని మహాశక్తిగా నిర్మాణం అవుతుందని తెలియజేశారు,అతి తక్కువ ఓట్ల తేడాతో కొన్నిచోట్ల నిరాశాజనకమైన ఫలితాలను చవి చూడవలసి వచ్చిందని పేర్కొన్నారు. తెరాసతో సరిసమానంగ ఫలితాలను కైవసం చేసుకోవడం.ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. బిజెపి నేతలు దృఢ సంకల్పంతో వారు చేసిన కష్టానికి గాను, బిజెపి నేతలను అభినందించారు. నూతన కార్పొరేటర్లు అందరూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అవినీతికి తావు లేకుండా తమ కార్య నిర్వహణలో నిమగ్నమై ప్రజల, పరిసరాల అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. అదేవిధంగా షేక్ రహమతుల్లా గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు బండి సంజయ్ తెలియజేశారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more