ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు స్త్రీ శక్తిని గుర్తించుటకు ఏర్పాటు చేసుకున్న రోజు. స్త్రీ ఎన్ని విధాలుగా కష్టపడుతుందో గుర్తు చేసుకోవాల్సిన రోజు. స్త్రీ ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటుందో గుర్తు చేసుకోవలసిన రోజు. అన్నింటినీ అధిగమించి ఎలా విజయపథం వైపు కు దూసుకుపోతున్నదో గుర్తు చేసుకోవాల్సిన రోజు.
మహిళలు ఆత్మ విశ్వాసాన్ని చాటుకోవాలి ,మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలి ,స్త్రీలు పురుషులు సమానం అనే భావన సమాజంలో బలపడాలి ,మహిళలు ముఖ్యంగా ఉన్నత విద్య సామాజిక మాధ్యమాలలో సమానత్వం రిజర్వేషన్లు మహిళా సాధికారతపై దృష్టి సాధించాలని,మహిళల ఆత్మ విశ్వాసం ఒక ఆయుధంగా చేసుకుని అనేక విజయాలు సాధించాలని తెలియజేశారు .దేశంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు కొద్దిమంది మాత్రమే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు , అధికశాతం నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు వారిలో చైతన్యం నింపి ఆత్మవిశ్వాసంతో అన్ని సమస్యలను ఎదుర్కొనే విధంగా తయారు కావాలని తెలియజేస్తున్నాను.తల్లిదండ్రులు కూడా లింగ భేదం లేకుండా స్త్రీని బాల్యం నుంచే వేరుగా చేయకుండా పెంపకంలో మార్పులు రావాలి ఈ ధోరణి కూడా మారాలని కోరుకుంటున్నాను .ఇంటికి ఇల్లాలు దీపం అని ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్ర్తి ఉంటుంది అని అందరూ విశ్వసించాలి .అన్ని రంగాలలో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలి లక్ష్యంతో వారిలో ఉన్న దృఢమైన సంకల్పబలంతో వారిలోని శక్తిని వెలికితీసి మహిళలు విజయాలు సాధించాలని తెలియజేశాడు.
మహిళలు వంటగది నుండి అంతరిక్షం వరకు అన్నింటా తన పాదముద్రలను వేసింది గొప్పదనం మహిళలకే దక్కుతుందని, అటువంటి మహిళ ఈనాడు అత్యంత అమానుషమైన, అతి దారుణమైన అత్యాచారాలను కూడా ఎదుర్కొన వలసి వస్తోంది. మహిళలను అగౌరవపరిచే వారు, ఒక ఆట వస్తువు గా భావించేవారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అటువంటి వారిని అణగదొక్కే దిశగా స్త్రీ శక్తి ఎదగాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదిపరాశక్తిగా మారి తనను తాను రక్షించుకోవాలని తెలియజేశాడు .
మహిళలు తమను తాము రక్షించు కొనుటకు మార్షల్ ఆర్ట్స్ ను ఆశ్రయించాలి, దానిలో ఉండే కొన్ని టెక్నిక్స్ ద్వారా తమని తాము రక్షించుకోవాలి .అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్న వారిని
ఎదురించవలచసిన సమయం ఆసన్నం అయినది. తరతరాలుగా సహనశీలిగా, త్యాగమూర్తిగా కొనసాగుతున్న స్త్రీ ఈనాడు కన్నెర్ర చేసి కాలు దువ్వడమే తన యొక్క తక్షణ కర్తవ్యం. ప్రతి చోటా స్త్రీ పైన జరుగుతున్న అత్యాచారాలకు ముగింపు పలక వలసి ఉంది. స్త్రీ శక్తిని చాట వలసిన సందర్భం ఏర్పడిందని తెలియజేశాడు.