మే 3 న ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (World Press Freedom Day ) సంధర్బంగా బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మొదట పత్రికారంగంలో శ్రమిస్తున్న పాత్రికేయ సోదరులందరికీ నా హృదయ పూర్వకా శుభాకాంక్షలు, మరియు కరోనా కట్టడి చేయడానికి నాలుగు స్తంభాలు అయినా డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు. నాలుగో స్తంభం అయిన జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర్యమైన, ప్రపంచవ్యాప్తంగా, బహుళ జాతుల సమన్వయానికి మాధ్యమంగా, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ఆర్ధిక అభివృధ్ధికీ, పౌరుల ప్రాధమిక హక్కుయైన పత్రికా స్వేచ్చ పరిఢవిళ్లడం అవసరం అని తెలియచేసాడు. పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు నేడు ఎదురవుతున్న సవాళ్లు, ప్రమాదాల గురించి పౌర సమాజానికి, ప్రభుత్వాలకు గుర్తు చేయడం, స్వేచ్చా పరిరక్షణకు పోరాడటం, జర్నలిస్టుల భద్రత పై ప్రత్యేక చట్టం తేవాలి అని ఒత్తిడి తేవడం, వృత్తిలో ఆదర్శ ప్రాయ మైన కృషి చేసిన మహనీయులను గౌరవించుకోవడం, విధి నిర్వహణ లో అసువులు బాసిన పాత్రీకేయులను స్మరించుకోవడం వంటివి చేయాలి అని తెలియచేసారు.
19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మూలాలు ఇమిడి ఉన్నాయి “భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు, జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. తెలియచేసాడు. రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెల్యకుండా పోతున్నాయి.
పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి వంటిది. జాతులు, సంస్కృతుల మధ్య భావ మార్పిడికి, వాటి అభివృధ్ధికి పత్రికలు, పత్రికా స్వేచ్చా తప్పనిసరి. ప్రజాస్వామ్యంలో నాలుగో పాదమైన పాత్రికేయం స్వేచ్ఛ గా సమాజ శ్రేయస్సు పరిరక్షణలో గౌరవంగా ముందుకు సాగాలని కోరుకుంటూ.,ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం అని తెలియచేసాడు.