బీసీ సమస్యల పరిష్కారానికి కృషి
బీసీల సమస్యలను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumara Swamy)
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister ponnam prabhaker) ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి కలిశారు. తెలంగాణలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బీసీలకు న్యాయం జరిగేలా తప్పకుండా చేస్తానని పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చారు. .. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
బీసీల బతుకుల్లో మార్పు తప్పకుండా వస్తుందని బలంగా నమ్ముతున్నాము.
బీసీ కులగణన చేయాల్సిన ఆవశ్యకత , బీసీ కులాల కార్పొరేషన్లు ,ప్రత్యేకమైన పథకాలు గురించి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి వివరించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారదర్శకంగా బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభాకర్ హామీ ఇచ్చారు. బీసీలకు మంచి జరిగేలా చిత్తశుద్ధితో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ కులగణనకు సంబంధించిన అంశాలను కూడా వివరించడం జరిగింది. కాంగ్రెస్‌తోనే బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని ప్రజలంతా నమ్ముతున్నారని తెలిపాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.మహేంద్ర బాబు సురేష్, మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు