స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(Dundra Kumara Swamy National President BC Dal)తెలిపారు.
బుధవారం నాడు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్‌ను (Dr K.Laxman) ఆయన నివాసంలో కలిసి బీసీ సంఘాల బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుండ్ర కుమారస్వామి, “గవర్నర్ పై ఒత్తిడి తీసుకురావాలి అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం అత్యవసరం” అని అన్నారు.
అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ ఇప్పటికే మద్దతు తెలిపిందని గుర్తు చేశాడు., “దానికి రాజ్యాంగ భద్రత కల్పించే బాధ్యత కూడా బీజేపీదే” అని స్పష్టం చేశారు.దశాబ్దాలుగా బీసీలు అణిచివేతకు గురవుతున్నారని, ప్రాతినిధ్యం లభించక వెనుకబాటుతనంలోనే ఉన్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులకు ఆమోదం లభిస్తేనే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు.
.
