మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న మహిళా జడ్జీలతో ఒక ప్రత్యేకమైన బెంచ్ ఏర్పాటు చేశారు. ఈ అరుదైన సంఘటన కేరళలో జరిగింది. ఆలయ నిధులను ఎవరికి విరాళంగా ఇవ్వొచ్చు అనే అంశానికి సంబందించి ధాఖలైన పిటిషన్‌ను విచారించడానికి ఈ ధర్మాసనం ఏర్పాటు చేయబడింది.
ఈ మహిళా ధర్మాసనం లో జస్టిస్ అను శివరామన్, జస్టిస్ షిర్సీ వి, జస్టిస్ ఎంఆర్ అనితలు ఉన్నారు. అయితే అంతకు ముందు జస్టిస్ ఎ. హరిప్రసాద్, జస్టిస్ అను శివరామ, జస్టిస్ ఎం.ఆర్ అనితలతో ఈ ధర్మాసనం ఏర్పాటు కాగా మహిళా దినోత్సవం రోజు వీరిని మర్చారు. ఆలయ నిధుల్ని గురువాయూర్ దేవస్థానం మేనేజింగ్ కమిటీ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థకి విరాళంగా ఇవ్వొచ్చా అనే అంశాన్ని వీరు విచారిస్తారు.