ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, హబ్సిగూడ ప్రధాన రహదారి అమీనా కాంప్లెక్స్ వద్ద టీ వీ ఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వేగంగా వచ్చిన ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలయ్యింది. ఎస్సై మైబేల్లి కథనం ప్రకారం,
ఉప్పల్ ఐడిఏ లక్ష్మీనారాయణ కాలనీలో నివసించే రాజ్యలక్ష్మి (29) శుక్రవారం ఉదయం వారసిగూడకు పనిపై ద్విచక్ర వాహనంపై వెళ్లి, తిరిగి ఇంటికి వస్తుండగా ఉప్పల్ అమీనా కాంప్లెక్స్ ప్రధాన రహదారిపై వెనుకనుంచి అతి వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టిగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ వైద్య దత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.