బీసీలకు కుల గణన ప్రధాన అంశం
కుల గణన అంటే భయం ఎందుకు??జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు ఆగదు బీసీల పోరాటం
దేశవ్యాప్తంగా బీసీ కుల గణనను ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటూ ఉంది.. ఓబీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం కేంద్రానికి ఇష్టం లేనట్లు అనిపిస్తూ ఉందని దుండ్ర కుమారస్వామి అన్నారు. దేశంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా బీజేపీ లోని బీసీ నేతలు మౌనం వహిస్తూ ఉన్నారని.. వారు చేస్తోంది సరిదిద్దుకోలేని తప్పు అని దుండ్ర కుమారస్వామి అన్నారు.
ప్రధాని మోదీ బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తామని, బీసీల కులగణనపై సానుకూల ప్రకటన చేయాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కుల గణన చేపట్టడం వల్ల బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీసీలకు 23% శాతంగా ఉన్న రిజర్వేషన్లను 42% శాతానికి పెంచాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కుల గణన చేపట్టి, జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దుండ్ర కుమారస్వామి అన్నారు.
దేశంలో కుల గణన చేయాలని డిమాండ్ ఊపందుకుందనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. కుల గణన చేయాలని దేశంలో పలు పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయని.. కేంద్రం కుల గణనపై స్పందించకపోవడంతోనే పలు రాష్ట్రాలు సొంతంగా తమ రాష్ట్రంలో కుల గణన చేయించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దేశంలో కుల గణన చేపడితేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని దుండ్ర కుమారస్వామి గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లోగా జనగణనలో కులగణన చేయాలని, పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో బిసి బిల్లు ప్రవేశపెట్టి బిసిలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాలని గత మూడు దశాబ్దాలుగా బీసీ నేతలు ఆనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. రాబోయే రోజుల్లో భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని.. తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని భారతీయ జనతా పార్టీని హెచ్చరించారు దుండ్ర కుమారస్వామి.