తెలంగాణ భవన్ : తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో హుజూరాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
తెలంగాణ ప్రజలు గర్వంగా, సగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఇలా ఎన్నో పథకాలను ప్రజల క్షేమాన్ని కాంక్షించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
తెలంగాణ ఎక్కడి వరకు ఉంటే అక్కడి దాకా చెట్లున్నట్లు తెలిపారు. ప్రజలు అడిగితేనే చెట్లు పెంచుతున్నమా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. మంచి జరగడం ప్రారంభమైంది. ఇంకా జరగాలన్నారు. ప్రతీ ఎన్నికల్లో ప్రజలు తమని దీవిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మీది.. రేపటి భవిష్యత్ యువకులదన్నారు.