ఈరోజు శేర్లింగంపల్లి లోని మాదాపూర్ బీసీ ద ల్ ఆఫీస్ లో ప్రతిరా అనే సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆసరా అనే కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు వీల్ చైర్ మరియు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.దీనిలో భాగంగా జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు కుమార స్వామి ముఖ్యఅతిథిగా రావడంజరిగింది ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఎలాంటి లాభం ఆశించకుండా వ్యాపారం చేయలేమని, పుణ్యం ఆశించకుండా దానం చేయలేరు, కానీ ఏమీ ఆశించకుండా చేసే సహాయం, కొన్ని సంస్థలు ఉంటాయి అందులో ప్రతి రా అనే సంస్థ కూడా ఒకటి అని తెలియజేశాడు.ప్రణీత్ నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ సంస్థను స్థాపించా ఆని చెప్పినప్పుడు చాలా సంతోషానికి గురయ్యానని తెలియజేశాడు.కొన్ని సందర్భాలలో ప్రణీత్ ని యొక్క సేవలు చూస్తుంటే తనను తాను గుర్తు చేసుకున్నట్టుగా ఉందని తెలియజేశాడు.. తను కూడా కౌన్సిల్ ఆఫ్ ఆన్ సోషల్ వెల్ఫేర్ అనే సంస్థ ద్వారా ఎయిడ్స్ మరియు ఇతర వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాలు చేశానని తనకు అప్పటి గవర్నర్ ద్వారా అవార్డ్ కూడా పొందటం జరిగిందని గుర్తు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా జీవితం అంటే జననానికి మరణానికి మధ్య ఉన్న చిన్న కాలి స్థలం, అని దానిలో సంతోషంగా ఉండాలి సేవ చేయాలి సహాయం చేయాలని, లక్షల మందికి సహాయం చేయలేకపోవచ్చు కనీసం 100 మందికి సహాయం చేయాలని మరియు చేతినిండా డబ్బు ఉన్నవాడు గొప్ప వాడు కాదు అని మంచితనం మానవత్వం ఉన్నవాడు గొప్ప వాడు అని తెలియజేశాడు . దివ్యాంగుల ను ఉద్దేశించి ఏది కోల్పోయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అలుపెరుగని ప్రయత్నంతో దృఢసంకల్పంతో ప్రయత్నం చేయాలని తెలియజేశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి కొన్ని ఉదాహరణలు చెబుతూ,నికోలస్ జేమ్స్ రెండు కాళ్లు రెండు చేతులు లేవు అని అతను ప్రపంచ బెస్ట్ మోటివేషన్ స్పీకర్ మరియు స్టీఫెన్ హాకింగ్ కూడా ఒక గొప్ప సైంటిస్ట్ తనకు కాళ్లు చేతులు కదలవు మాటలు కూడా రావని , ప్రముఖ డ్యాన్సర్ సుధా చందర్ అద్భుతమైన డాన్సర్ అని తనకు కూడా ఒక కాలు లేదని తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో,గొప్ప లక్ష్యంతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తున్నాం అని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో లో సంస్థ కార్యదర్శి మరియు ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more