విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘము తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ( కార్యదర్శి ) గా నియామకం అయిన ధన్నోజు నరేష్ చారి..
ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరిగిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘము రాష్ట్ర కార్యవర్గ విస్తరణ లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఏర్రోజు భిక్షపతి చారి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ( కార్యదర్శి ) గా ధన్నోజు నరేష్ చారి గారిని నియమించి, నియామక పత్రాన్ని అందజేయాడం జరిగింది..
ధన్నోజు నరేష్ చారి విశ్వబ్రాహ్మణ ఐక్యత కు కృషి చేస్తూ, ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూ, నిరుపేద విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు అండగా ఉన్న ధన్నోజు నరేష్ చారి ఇప్పటి వరకు మండల ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి గా, నేడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా పదవులు పొందడం జరిగింది..
ఈ సందర్భంగా ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ, బీసీలలో విశ్వబ్రాహ్మణ లు నేడు ఎంతో వెనకబడి ఉన్నారు, విశ్వబ్రాహ్మణ జాతి ఎంతో తెలివితేటలు గల జాతి, నేడు ఈ జాతి మనుగడ ప్రశ్ననర్ధకం అయ్యేలా ఉంది.. ఎక్కడ చూసైనా కూడా అన్ని రెడీ మెడ్ గా తయారు చేయడం వల్ల నా జాతి చేతి వృత్తిని నమ్ముకున్న వాళ్ళు నడి రోడ్డుపై పడటం జరిగింది.
ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ, బీసీల బ్రతుకులు మారలేదు. బీసీలను కేవలం ఓటు కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు, అందుకే ఈ ఐక్య సంఘము అద్వర్యంలో మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బీసీల బలం ఏంటో చూపిస్తామని తెలియజేస్తూ…
నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఏర్రోజు భిక్షపతి చారి గారికి, మరియు ప్రధాన కార్యదర్శి గణేష్ గారికి మరియు కోశాధికారి మధు గారికి మా అభిమాన నాయకుడు గౌరవ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి గారికి నరేష్ ధన్యవాదాలు తెలియజేశారు.