తొలిపలుకు న్యూస్ : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని,తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి హిల్స్,గోకుల్ ప్లాట్స్ నందు స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు,నాయకులతో కలిసి కాలనీలో పాదయాత్ర నిర్వహించారు,స్థానికంగా చేపట్టాల్సిన అభివృధి పనులపై సమీక్షించారు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్.
ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు బి.శ్రీనివాస్,మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ సాంబశివ రావు,నాయకులు ప్రభాకర్,రాజేష్,రాజు గౌడ్,దుర్గ రావు,పితాని శ్రీనివాస్,మల్ల రెడ్డి,సత్యం,సాయి హిల్స్ కాలనీ వాసులు అనిల్,రాజ్ శేఖర్,శ్రీనివాస్,వెంకటేశ్వర రావు,సాంబశివ రావు,రాజు తదితరులు పాల్గొన్నారు..