న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సింది గా ప్రధాని మోడీని సీఎం కోరారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు.
ప్రధానికి అందించిన లేఖలు:
- ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలి.
- రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి.
- హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలి.
- కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
- ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలి.
6.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి.
- ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలి.
8.కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలి.
- హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలి.
- రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.అనే అంశాలకు సంబంధించిన లేఖలున్నాయి.
ఈ భేటీ సందర్భంగా… ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ ‘తెలంగాణ భవన్’ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని సీఎం కోరారు. సీఎం అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు.