నిజాంపేట్: తెలంగాణ రాష్ట్ర, నిజాంపేట్ మున్సిపల్ కారోజుర్పొరేషన్ ప్రగతి నగర్ 2వ డివిజన్ పరిధిలోని NRI కాలనీ ఝాన్సీ లక్ష్మీబాయి పార్క్ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డ్ కమిటీ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద గౌడ్, మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీ ధనరాజ్ యాదవ్, కమిషనర్ శ్రీ గోపి ఐఏఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఆయా
కాలనీలలో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కాలనీ మరియు కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఎల్లపుడూ కృషి చేస్తామని వారికి తెలిపారు. అదే విధంగా 7వ విడత తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా పలు మొక్కలు నాటడం జరిగింది.
అదే విధంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటి వాటిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలి అని సూచించారు. కార్యక్రమంలో భాగంగా NMC కి సంబంధించి నూతనంగా కొనుగోలు చేసిన ఫాగింగ్ మిషన్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ చిట్ల దివాకర్, మరియు గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మరియు భాస్కర్ చారీ, సాంబశివరెడ్డి, తిరుపతి, చిట్ల సుగుణాకర్, వేణు. ధర్మేందర్, దుర్గ,గణపతి, శ్రీనివాస్, సుధాకర్, ధర్మేందర్, సుబ్బారెడ్డి, నరేంద్ర, శ్రీనివాస్ రావు, Nri కాలనీ దివాకర్ రెడ్డి, బలరాం, విజయ్, త్రిలోక్, వినీల్, శ్రీరామ్, సురేష్ రెడ్డి, మాధురి, ఉషాకిరణ్ లక్ష్మీ ప్రసన్న, సువర్ణ తదితరులు కాలనీ వాసులు NMC మేనేజర్, DE , ఎలక్ట్రికల్ AE, ఇతర ముఖ్య అధికారులు, వార్డు స్పెషల్ ఆఫీసర్,మరియు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.