హైదరాబాద్: బంజారాహిల్స్ లోని విరించి హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స చేసేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రిలో కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రొటోకాల్ ప్రకారం చికిత్స కొనసాగించాలని తెలిపింది.
ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే హాస్పిటల్ లైసన్సును రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. నల్గొండ జిల్లాకు చెందిన బాధితుడు వంశీ అనే వ్యక్తి కృష్ణ కుటుంబం వచ్చిన ఫిర్యాదు అధారంగా ప్రభుత్వం ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది.