- ఆపదలో అన్నా అని వస్తే…
- నేనున్నా అంటూ కరోనా రోగులకు అండగా నిలుస్తున్న మాజీ శాసనసభ్యలు వేముల వీరేశం
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు, వాసవినగర్ కి చెందిన కోమటిరెడ్డి లక్ష్మమ్మ గారు కరోనాతో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న జననేత గౌరవ మాజీ శాసనసభ్యులు & ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం గారు, లక్ష్మమ్మ మృతదేహానికి అనుచరులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
తెలంగాణలో కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం గారు నిత్యం జనాల మధ్యే ఉంటూ వారికే ఎలాంటి ఆపద వచ్చినా… నేనున్నా అంటూ వారికి అండగా ఉంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు.