- పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ…
- కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
- యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి
- 8వ డివిజన్ లో హైపోక్లోరైట్ పిచికారి, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ…
బొడుప్పల్: దేశంలో కరోనా విజృంభిస్తున్న వేల కరుణ కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి అన్నారు. గురువారం రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ లో, మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివాసేనారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మక్ కళ్యాణ్ కుమార్ లతో కలిసి సోడియం హైపొక్లోరైడ్ పిచికారీ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ నగర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకటరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్,ప్రధాన కార్యదర్శి ఉప్పుగల్ల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు తోటకూర యూత్ నాయకులు సింగిరెడ్డి రాజురెడ్డి, అసర్ల బీరప్ప, మాకు శివ, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు