బోడుప్పల్: ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి , జంట కార్పొరేషన్ల ఇంచార్జి వసునూరి సన్నీ గారి అధ్వర్యంలో బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాసాల కుమార్ యాదవ్, గాలయ్య, మహేందర్ యాదవ్, శ్రీకాంత్, TNSF అధ్యక్షులు శ్రావణ మరియు కార్యకర్తలు , బోడుప్పల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించడం జరిగింది. అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఇసొలేషన్ సెంటర్ లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వసునురీ సన్నీ మాట్లాడుతూ..
కరోనా వచ్చి ఇసోలేషన్ కావడానికి ఇంట్లో వేరే రూమ్స్ లేని వాళ్ళు ఈ ఐసోలేషణ్ సెంటర్ ను ఉపయోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. అలాగే బోడుప్పల్ లో వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి అని, అలాగే కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి అని డిమాండ్ చేశారు.