హైదరాబాద్ పాతబస్తీ లోని జాంబాగ్ లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఈ దొంగతనం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలల్లోకెళ్తే ఆరోగ్య సిబ్బంది శనివారం విధులు ముగుంచుకుని ఎప్పటిలాగే తాళం వేసి వెళ్ళారు.
సోమవారం ఉదయం వచ్చి తలుపు తెరిచి చూడగా అందులో వాక్సీన్స్, ఇతర సామాగ్రీ కనిపించడం లేదు.
ఇందులో రెండు కంప్యూటర్ మానీటర్లు, సి.పి.యు. లు, మౌస్లు, కీబోర్డ్లు కూడా మాయం అయ్యాయి.
గోడకు ఉన్న స్మార్ట్ టీవీ ని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిచినా వారివల్ల కాలేదు.
ఇక ఔషధ సామాగ్రి లో 17 కోవాగ్జిన్ వాయిల్స్, 27 కోవిషీల్డ్ వాయిల్స్, 22 బీసీజీ, 44 ఓపీవీ, 15 డీటీపీ, 7 ఐపీవీ 7, 39 హెపాటీబీ, 38 ఎంఆర్, 7 పీసీపీ, 23 పెంటా, 21 డీటీ, 2 ఏఈఎఫ్‌ఐ కిట్స్ కనిపించడం లేదు.
ఎం.ఓ. లింగమూర్తి ఈవిషయాన్ని మీర్‌చౌక్ పోలీసులకు కంప్లైంట్ అందించగా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉంది.