పోర్చుగల్‌కు షాకిచ్చిన ఉరుగ్వే ..వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌లోకి ప్రవేశo
పోర్చుగల్‌కు షాకిచ్చిన ఉరుగ్వే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో పోర్చుగల్‌పై 2-1 గోల్స్ తేడాతో ఉరుగ్వే నెగ్గింది. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌తో ఉరుగ్వే తలపడనున్నది. ఉరుగ్వే ప్లేయర్ ఎడిసన్ కవానీ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో వరల్డ్‌కప్‌లో క్రిస్టియానో రోనాల్డో షో ముగిసింది. గ్రూప్ స్టేజ్‌లో నాలుగు గోల్స్ చేసి పోర్చుగల్‌ను ముందుకు నడిపించిన రోనాల్డో.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఆట ఏడవ నిమిషంలోనే హెడర్ గోల్ చేశాడు కవానీ. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్‌లో రెండు జట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. కానీ మళ్లీ గోల్స్ దక్కలేదు. ఇక సెకండ్ హాఫ్‌లో పోర్చుగల్ ప్లేయర్ పెప్పి 55వ నిమిషంలో గోల్ చేశాడు.
ఉరుగ్వే ప్లేయర్ కవానీ ఈ మ్యాచ్‌లో మరోసారి తన సత్తా చాటాడు. ఆట 62వ నిమిషంలో స్టన్నింగ్ గోల్ చేశాడు. దీంతో రోనాల్డో టీమ్ ఆశలు గల్లంతయ్యాయి. శుక్రవారం ఫ్రాన్స్, ఉరుగ్వే మధ్య క్వార్టర్స్ మ్యాచ్ జరుగుతుంది.