- ప్రణాళికబద్ధంగా పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి.
- జిహెచ్ఎంసి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.
కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతం అయ్యేలా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జిహెచ్ఎంసి అన్ని శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
పట్టణ ప్రగతిలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ చర్యలు, కరోనా పట్ల ప్రజలకు సూచనలివ్వాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమయ్యే చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టే ప్రాంతాల్లో అధికారులంతా సమయానికి చేరుకొని ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిసీలు మంగతాయారు, రవీందర్ కుమార్, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.