ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్, అన్నపూర్ణ కాలనిలో 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఉప్పల్ పోలీసులు.. ఇక వివరాల్లోకి వెళ్తే.. బానోతు లలిత అనే మహిళ, ఆరు సంవత్సరాల క్రితం ఆమె భర్త మరణించడంతో జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చింది. ఉప్పల్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి పిడిఎస్ బియ్యాన్ని 5రూపాయలకు కిలో చొప్పున కొని ఉప్పల్‌లోని అన్నపూర్ణ కాలనీలో అవే బియ్యేన్ని సాధారణ ప్రజలకు 10రూపాయల చొప్పున విక్రయిస్తూ, సామాన్య ప్రజలను మోసం చేస్తోంది అనే సమాచారం అందుకున్న పోలీసులు ఆమె విక్రయిస్తున్న స్థలానికి చేరుకుని 40 బస్తాల పిడిఎస్ రైస్ (సుమారు 20 క్వింటాల్స్) మరియు శామ్సంగ్ కీప్యాడ్ వైట్ కలర్ ఫోన్‌ను నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆమె ఇంతకు ముందు కూడా ఇలాంటి విషయాల్లోనే అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు..
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more