ఉప్పల్ : ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి తమ గొప్ప మనసు చాటారు. మానవత్వంతో రోడ్డున పడిన బాలింతను అక్కున చేర్చుకున్నారు. ఇక విషయాల్లోకెళ్తే..

ఉప్పల్-నాగోల్ మార్గంలో మెట్రో రైలు ఫిల్లర్ 821 ప్రాంతంలో ఇటీవల మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించారు.ఇక్కడి గుడిసెలలో ఉండే ఐదు రోజుల బాలింత సైతం రోడ్డున పడింది.
అంగన్ వాడీ, హెల్త్ సూపర్ వైజర్ ల ద్వారా విషయం తెలుసుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి చలించిపోయారు. సాటి మహిళగా వెంటనే స్పందించారు. గురువారం అంగనవాడీ, హెల్త్ అధికారులు, సిబ్బందితో కలిసి బాలింతను కలిశారు. తన వంతుగా సహాయాన్ని అందించడంతో పాటు మహిళా శిశు సంక్షేమ నుంచి కూడా కావాల్సిన సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సీడీపీఓ స్వాతి గారు ,పార్వతి గారు ,సీహెచ్ఓ గొంగిడయ్య గారు ,ఉమామహేశ్వరి గారు ,సునీత గారు ,సంధ్యారాణి గారు విజయ, తదితరులు పాల్గొన్నారు.