మరోసారి యూపీలో కాంగ్రెస్‌కు ఘోరపరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసిన కాషాయదళం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ విజయదుందిబి మోగించింది. మొత్తం పదహారు నగరపాలక కార్పొరేషన్లలో పద్నాలుగు చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ కంచుకోట రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేధిలోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. బహుజన సమాజ్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందగా, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు అసలు ఖాతాలే తెరవలేదు. లక్నో, ఫిరోజాబాద్, అమేధీ, అలహాబాద్, అయోధ్య, కాన్పూర్, షహరాన్‌పూర్, ఘజియాబాద్, గోరఖ్‌పూర్, బృందావన్-మథుర, రాయబరేలి, మొరాదాబాద్, ఝాన్సీ, వారణాసి నగరపాలక సంస్థలను బీజేపీ గెలుపొందగా, అలీగఢ్, మీరట్ నగరపాలక సంస్థలను బీఎస్పీ గెలుచుకుంది.
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం
మాదాపూర్ లో ఘనంగా సదర్ సమ్మేళనం తెలంగాణ సాంప్రదాయ సాంస్కృతికి నిదర్శనం సదర్ జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శ్రీకృష్ణుని అంశతో జన్మించిన యాదవులు...
Read more