కర్నూలు (తొలిపలుకు న్యూస్) : కర్నూల్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన స్పందన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.
స్పందన కార్యక్రమానికి సెప్టెంబర్ 13వ రోజు మొత్తంలో 123 ఫిర్యాదులు వచ్చాయి. స్పందనకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలు యుగంధర్ బాబు, రామాంజి నాయక్, దిశా వన్ స్టాప్ సెంటర్ మేరీ స్వర్ణలత ఉన్నారు.