ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయం…సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా న్యూ అల్లాపూర్ చిల్లా,రాజీవ్ గాంధీ నగర్,సఫ్దర్ నగర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా జండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది.అలాగే ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయం అని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గంగా జమునా తేహజీబ్,పాలు నీళ్లలా ప్రజలంతా కుల,మత,ప్రాంత, వర్గ బేధాలు లేకుండా పండుగలు జరుపుకుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు స్థానిక నాయకులు ఆల్లపుర్ కోఆర్డినేటర్ వీరారెడ్డి,కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more