ఉక్రెయిన్లోని కొందరు ఐటీ నిపుణులు ఒక గ్రూపుగా రూపొంది రష్యా సైన్యాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. వీరు సాధారణ అవసరాలకు వాడే డ్రోన్లలో కొన్ని మార్పులుతో వాటిని రష్యా వాహనాలపై బాంబులు విసిరేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ గ్రూపులో ఎక్కువ మంది పీహెచ్డీ చేసినవారు, ఐటీ తో పాటూ ఇతర రంగాల్లో పనిచేసేవారున్నారు.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వొలొదిమిర్ కొచెట్కోవ్ ఏరో రోజ్విడ్కా పేరుతో ఈ గ్రూపును మొదట ఏర్పాటు చేశారు. ముందు నుంచి ఈ గ్రూప్ ఉక్రెయిన్ సైన్యంతో కలిసి పనిచేస్తుంది. ఈ యూనిట్లో చాలా రకాల డ్రోన్లు వినియోగిస్తోంది.
ఏరో రోజ్విడ్కా బృందాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. డ్రోన్ టీమ్, డెల్టా టీమ్, సైబర్ టీమ్. వీటిలో డెల్టా టీమ్ నాటో సహకారంతో ముందుకు సాగుతోంది. వీరు రష్యా దళాల కదలికలను ఆధారంగా సమాచారాన్ని విశ్లేశించి దాడులు చేస్తారు. వీరు ఎలాన్ మస్క్ ఇచ్చిన స్టార్ లింక్ శాటీలైట్ను ఉపయోగిస్తున్నారు.