బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టు సోమవారం ఆదేశించింది. రూ.9 వేల కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఈ దర్యాప్తును తప్పించుకునేందుకు 2016 మార్చిలో లండన్ వెళ్ళిపోయారు. దీంతో ఆయనను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఆయనను భారతదేశానికి అప్పగించాలని కోర్టు ఆదేశించడంతో భారతదేశం దౌత్యపరమైన విజయం సాధించినట్లయింది.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more