బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారణమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో సంజీవ్ శరన్, కే వీరా బ్రహ్మజీ రావులు ఉన్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్యాంకును రూ.13,500 కోట్ల రుణం తీసుకొని దొంగచాటున విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు ఈడీలపై కేంద్రం వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు, సీనియన్ ఉద్యోగుల చేతివాటం లేకుండా ఇలాంటి కుంభకోణాలు జరుగవని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఇలా సీనియర్ ఉద్యోగులపై వేటువేయడం 1970 తర్వాత ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది జూలై 3న వీరిద్దరికి కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిపై వేటు వేయడం మంచిదే కానీ, ఈ మోసంలో మరింత మంది సీనియర్ అధికారులు ఉన్నారని, వీరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more