ఈ మధ్య వినూత్నంగా ఆలోచించి ప్రజలను ఆకర్షిస్తున్న టి.ఎస్.ఆర్.టి.సి. ఉమెన్స్ డే సందర్భంగా బహుమతులతో పాటు కొన్ని ఆఫర్లు ప్రకటించింది.
- ఈ నెల చివరి వరకు బస్టాండ్లలో ఏర్పాటు చేసిన పర్పుల్ కలర్ డబ్బాలలో టికెట్లు వేస్తే, లక్కీ డ్రా తీసి ఆయా డిపోల నుంచి 30 కి.మీ. వరకు ఉచితంగా ప్రయాణించేలా మంత్లీ సీజన్ టికెట్ మరియూ కొన్ని బహుమతతులు ఇస్తామని ప్రకటించారు.
- ఈరోజు (మార్చి 8న) 60 కంటె ఎక్కువ వయసున్న స్త్రీలు ఐడి చూపించి బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేయవచ్చని చెప్పారు.
- హెవీ వెహికిల్ డ్రివింగ్ నేర్చుకోవాలనే స్త్రీలు వారి దగ్గరలోని డిపోలో అప్లై చేసుకుంటే ఉచితంగా డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తారు.
- మార్చి 8-14 వరకు హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ, వరంగల్ లలో టి24 టికెట్స్ పై డిస్కౌంట్ ఉంటుంది.
- ఇకపై గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండు ప్రత్యేక సీట్లు రిజర్వ్ చేస్తారు.
- సిటీ లో పీక్ అవర్స్ లో ఇప్పుడు ఉన్నదానికంటే 4 ట్రిప్పులు ఎక్కువగా కేవలం మహిళల కొరకు నడుపనుంది.