సంక్రాంతి సెలవుల్లో టి.ఎస్.ఆర్.టి.సి. కి బాగా కలిసి వచ్చింది. ఈనెల 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు టి.ఎస్.ఆర్.టి.సి. బస్సుల్లో సుమారు 55 లక్షల మంది ప్రయాణించారు.తద్వారా 107 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ వారం రోజుల్లో అదనంగా దాదాపు 4000 బస్సులను అదనంగా నడుపవల్సి వచ్చింది.
సాధారణంగా దాదాపు ప్రతీరోజూ 12 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ ఇది పండగ రోజుల్లో సుమారు 15.20 కోట్లకు పెరిగింది.టి.ఎస్.ఆర్.టి.సి. ని నమ్మిన ప్రజలకు చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.డి. సజ్జనార్ ధన్యవాదాలు తెలియజేశారు.