ట్రక్కుతో ఢీకొట్టిన అతను అది దిగి పారిపోయే సమయంలో అల్లా హో అక్బర్ అని అరిచినట్లుగా తెలుస్తోంది. ఇది ఉగ్రదాడి అని మేయర్ చెప్పారు. సెప్టెంబర్ 2011 తర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు.
న్యూయార్క్: అమెరికాలోను న్యూయార్క్ రాష్ట్రం మన్‌హటన్‌లో బుధవారం ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో పదకొండు మందికి గాయాలయ్యాయి. ఆగి ఉన్న పాఠశాల బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కుతో బస్సును ఢీకొట్టి పారిపోతున్న వ్యక్తిని పోలీసులు కాల్చారు. దీంతో అతను గాయపడ్డాడు.