వలిగొండ: టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వలిగొండ మండలం, నాగారం గ్రామంలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను గ్రామ శాఖ అధ్యక్షుడు నాగార్జున గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు. ఎండి సలీం, పి ఎస్ ఎస్ వైస్ చైర్మన్ ఎల్లంకి స్వామి, పార్టీ వార్డు మెంబర్లు కోఆప్షన్ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి యావత్ భారతదేశంలో అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు..
అలాగే ఇటీవల మరణించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపల్లి నాగ శేఖర్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట డైరెక్టర్ కొంపల్లి సత్తయ్య గౌడ్, మై స్సోల సత్యం, ఎర్ర విక్రమ్, మత్స్యగిరి, మహేష్, అరుణ్ కృష్ణ, కనకయ్య, సాదిక్,కలీం వెంకట్,ప్రవీణ్, శ్రీకాంత్, అరుణ్ లక్ష్మయ్యలు పాల్గొనడం జరిగింది..