మూడు సార్లు తలాక్ చెబితే ఇక నేరం. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి ఇవాళ కొత్త ఆర్డినెన్స్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇటీవల పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుమతి దక్కని విషయం తెలిసిందే. అయితే మూడుసార్లు తలాక్ చెబితే.. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కేంద్ర క్యాబినెట్ ఇవాళ నిర్ణయించింది. ట్రిపుల్ తలాక్‌పై తీసుకు వస్తున్న కొత్త ఆర్డినెన్స్.. ముస్లిం మహిళల వివాహ చట్టానికి తగ్గట్లుగా ఉంటుంది. గత ఏడాది లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం దక్కినా.. రాజ్యసభలో మాత్రం దానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వివాదాస్పద బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని అప్పట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ట్రిపుల్ తలాక్ అంశంపై అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను కూడా కేంద్రం సేకరించింది. ఈ బిల్లుకు దాదాపు అన్ని రాష్ర్టాలు ఓకే చెప్పేశాయి. మూడు సార్లు తలాక్ అని చెబితే, ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చినట్లే. అయితే ఆ సంస్కృతికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more